తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రూమర్స్​పై ప్రశ్న.. విలేకరికి సమంత ఘాటు రిప్లై

ప్రముఖ సినీనటి సమంత(Samantha Akkineni) తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ దర్శన సమయంలో ప్రత్యేక దర్శనం చేసుకున్న ఆమె.. వైవాహిక జీవితంపై(Samantha Marriage) వస్తున్న ఊహాగానాలపై ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఘాటుగా స్పందించారు.

Samantha news
Samantha news

By

Published : Sep 18, 2021, 7:22 PM IST

Updated : Sep 19, 2021, 12:00 AM IST

స్టార్ హీరోయిన్ సమంత(Samantha) కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాలకు కేరాఫ్‌గా మారింది. ఇటీవలే 'శాకుంతలం'(Samantha Shakuntalam) సినిమాను పూర్తి చేసింది. కొన్ని రోజులుగా విశ్రాంతి తీసుకుంటున్న ఆమె ఇంతలోనే కొత్త కథకు పచ్చజెండా ఊపేసింది(Samantha New Movie). ఓ కొత్త దర్శకుడు చేయనున్న సినిమా అది. శ్రీదేవి మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మించనున్నారు. వినూత్నమైన కథ కావడం వల్ల, సమంత వెంటనే సినిమా చేయడానికి అంగీకరించారని, నవంబర్‌ నుంచి ఆ సినిమా ప్రయాణం మొదలు కానుందని తెలిసింది. అదీ కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమా అని సమాచారం.

కాగా శనివారం సమంత తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని(samantha at tirumala) దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో ఆమె పాల్గొన్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను ఆమె స్వీకరించారు.

ఈ సందర్భంగా నాగచైతన్య-సమంత(samantha naga chaitanya wedding) విషయంలో వస్తున్న రూమర్స్‌పై ఓ విలేకరి ప్రశ్నించగా సామ్‌ కాస్త ఘాటుగానే స్పందించారు.

ఇవీ చదవండి:

Last Updated : Sep 19, 2021, 12:00 AM IST

ABOUT THE AUTHOR

...view details