తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'సమంతకు దూకుడెక్కువ.. అచ్చం కోహ్లీలానే..' - విరాట్​ కోహ్లీ

Samantha Virat Kohli: టాలీవుట్ స్టార్​ హీరోయిన్ సమంత ఒకవేళ అథ్లెట్ అయి ఉంటే.. టీమ్​ఇండియా స్టార్ బ్యాటర్​ విరాట్ కోహ్లీలా ఉండేదని అన్నారు ఆమె ట్రైనర్​ జునైద్ షేక్​. కోహ్లీలానే సామ్​కు దూకుడు ఎక్కవని చెప్పారు. ఇంకా అతను ఆమె గురించి ఏం చెప్పాడంటే?

samanta
samantha virat kohli

By

Published : Mar 3, 2022, 7:57 PM IST

Samantha Virat Kohli: ఫిట్‌నెస్‌కు అత్యంత ప్రాధాన్యమిస్తుంది టాలీవుడ్​ స్టార్​ హీరోయిన్ సమంత. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నా.. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తుంది. ఫిట్‌నెస్‌కు అత్యంత ప్రాధాన్యమిచ్చే సామ్‌... తాను చేసే జిమ్‌ వర్కవుట్స్‌కి సంబంధించిన వీడియోలను సోషల్‌మీడియాలో షేర్​ చేసి అలరిస్తుంది.

సమంత వర్క్​అవుట్​

గతంలో 100 కిలోల బరువున్న బార్బెల్‌ను సులువుగా ఎత్తి ఆశ్చర్యపరిచింది. స్క్వాట్స్, ఏరోబిక్స్, యోగా, జిమ్, వెయిట్ లిఫ్టింగ్.. ఇలాంటివన్నీ చేస్తూ అందం, ఆరోగ్యాన్ని కాపాడుకుంటుంది.

జిమ్​లో సామ్

మరి సామ్‌ అంత ఫిట్‌గా ఉండటానికి ఒక కారణం జునైద్‌ షేఖ్‌. ఫిట్‌నెస్‌ వీడియోల్లోనూ తన ట్రైన‌ర్ జునైద్ షేఖ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తుంది. ఇటీవలే జునైద్ ఓ ఇంటర్వ్యూలో సమంతకు ఫిట్‌నెస్​పై ఉన్న శ్రద్ధ గురించి ఇలా చెబుతూ.. "స‌మంత ఒకవేళ అథ్లెట్ అయితే విరాట్ కోహ్లీలా ఉండేది. నేను ఎంత కష్టమైన వ్యాయామం చెప్పినా స‌మంత మరొకసారి చెయ్యి నేను ప్రయత్నిస్తా అంటుంది కానీ చెయ్యను అని ఎప్పుడూ చెప్పదు. సమంత చాలా దూకుడుగా ఉంటుంది. క‌ష్టమైన ప‌నులు చేయాల‌నుకుంటుంది. సమంతని చూసి నేను స్ఫూర్తి పొందుతాను. ఏ రోజూ వర్కవుట్స్‌ అంటే నో చెప్పదు." అని వెల్లడించారు.

సమంత

ఇదీ చూడండి:samantha: సమంతను ప్రెగ్నెంట్​ చేస్తానంటూ నెటిజన్‌ కామెంట్​.. !

ABOUT THE AUTHOR

...view details