Samantha Varun Dhawan: విడాకుల అనంతరం సినిమాల విషయంలో స్పీడ్ పెంచారు అగ్రకథానాయిక సమంత. దక్షిణాదితోపాటు బాలీవుడ్ ప్రాజెక్ట్‌లకూ ఆమె పచ్చజెండా ఊపేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల ఆమె ఎక్కువగా ముంబయిలో దర్శనమిస్తున్నారు. భవిష్యత్తు ప్రాజెక్ట్‌లకు సంబంధించి పలువురు దర్శకులతో చర్చిస్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రం దర్శకులు రాజ్ అండ్ డీకేలను సమంత కలిశారు. 'ఫ్యామిలీమేన్-2' సిరీస్‌తో తనకు మంచి గుర్తింపు ఇచ్చిన వీరిద్దరిని కలిసి మాట్లాడారు. అయితే ఈ మీటింగ్‌లో సమంతతోపాటు బాలీవుడ్ వరుణ్ ధావన్ కూడా పాల్గొన్నారు.
అనంతరం సమంత-వరుణ్ ధావన్ బయటకు రాగానే ఫొటోగ్రాఫర్లు, అభిమానులు వారిని చుట్టుముట్టారు. ఫొటోలు తీసుకునేందుకు ఎగబడ్డారు. "సమంత.. సమంత.." అంటూ కేకలు వేశారు.