Samantha unfollow naga chaitanya on instagram: విడిపోయిన తర్వాత నాగచైతన్య-సమంత తమ కెరీర్‌పై పూర్తి దృష్టిసారించారు. వరుసగా సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే వారికి ఎన్నో ప్రశ్నలు.. విమర్శలు ఎదురయ్యాయి. అయితే సామ్ మాత్రం విమర్శలకు దీటైనా సమాధానం ఇస్తూనే నిత్యం వార్తల్లో నిలుస్తోంది.
ఇటీవలే చైతూతో కలిసి ఉన్న ఫొటోలను తన సోషల్‌మీడియా ఖాతా నుంచి తొలిగించిన సామ్.. తాజాగా నెట్టింట్లో మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. ఇన్‌స్టాలో చైతూను అన్‌ఫాలో చేసింది సమంత. కానీ నాగార్జున, అమల, అఖిల్, సుశాంత్, రానా వెంకటేశ్ కూతురు అశ్రితలను ట్విట్టర్, ఇన్‌స్టాలో ఫాలో అవుతోంది. దీంతో 'ఎందుకలా చేశావ్ సామ్' అంటూ నెటిజన్లు ఆమెను ప్రశ్నిస్తున్నారు. కాగా, నాగచైతన్య ఇటీవలే ఇన్‌స్టాలో ఓ ఘనతను అందుకున్నాడు. అతడి ఫాలోవర్స్ సంఖ్య 7 మిలియన్లకు చేరుకుంది. ఇక ట్విట్టర్లోనూ చై-సామ్ ఒకరినొకరు ఫాలో అవ్వడం మానేశారు. ప్రస్తుతం ఈ టాపిక్ నెట్టింట తెగ చర్చనీయాంశమైంది.