నాగచైతన్య - సమంత దంపతులు ఓ గొప్ప సాహస ప్రయాణానికి సిద్ధమయ్యారు. అనుకున్నదే తడవుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని తమ పెంపుడు కుక్క 'హ్యాష్'తో కలిసి ఎంచక్కా కారెక్కేశారు. చిరు నవ్వులు చిందిస్తూ తమ సాహస యాత్రను షురూ చేసేశారు. ఇప్పుడిక్కడ చూస్తున్న ఫొటో అప్పుడు తీసుకున్నదే. తాజాగా సమంత తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో ఆ ఫొటోను పంచుకుంది.
సాహస ప్రయాణానికి సిద్ధమైన చైతూ-సామ్ - Samantha Twitter post goes viral\
లాక్‌డౌన్ కారణంగా లభించిన ఖాళీ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు చై-సామ్ దంపతులు. సమంత తరచూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ అభిమానులకు దగ్గరగా ఉంటోంది. తాజాగా ఇరువురికి సంబంధించిన ఓ ఫొటోను నెట్టింట షేర్ చేసింది.
సమంత
అదేంటి.. ఈ లాక్‌డౌన్ సమయంలో వీళ్లిద్దరికి ఈ సాహస యాత్ర ఎలా సాధ్యమైంది? అనుకుంటున్నారా!. మరేం లేదు.. వాళ్లు విహార యాత్రకు బయల్దేరిన సంగతి వాస్తవమే. కానీ, అది జరిగింది ఇప్పుడు కాదు. ఈ ఫొటో.. ఆ సాహస యాత్ర.. గతంలో జరిగిన ముచ్చట. నాటి ఫొటోను ఇన్నాళ్లకు సామ్ సామాజిక మాధ్యమాల వేదికగా బయటపెట్టింది.
"దాదాపుగా ఓ గొప్ప సాహస ప్రయాణానికి సిద్ధమవుతున్నాం" అంటూ తమ ఫొటోకి ఓ వ్యాఖ్యను జోడించింది. ప్రస్తుతం ఇది నెట్టింట అందరి దృష్టినీ ఆకట్టుకుంటోంది.