తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'దిశ' ఉదంతంపై సినిమా.. సమంత కీలక పాత్ర! - entertainment news

సంచలనం రేపిన 'దిశ' ఘటనపై సినిమా తీసే ఆలోచనలో ఉన్నాడో కోలీవుడ్ దర్శకుడు. ఇందులో సమంత కీలక పాత్ర పోషించనుందట. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

'దిశ' ఉదంతంపై సినిమా.. సమంత కీలక పాత్ర!
దిశ పాత్రలో హీరోయిన్ సమంత

By

Published : Dec 22, 2019, 9:26 AM IST

శంషాబాద్​లో ఇటీవలే జరిగిన 'దిశ' హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులోని నిందితులు.. ఆ తర్వాత పోలీసుల చేతిలో ఎన్​కౌంటర్​ అయ్యారు. అయితే ఈ ఉదంతాన్ని సినిమాగా తీసేందుకు పలువురు దర్శక-నిర్మాతలు సిద్ధమవుతున్నారట. ఇందులో సమంత కీలక పాత్ర పోషించనుందని సమాచారం.

తమిళ దర్శకుడు శరవణన్.. దిశ హత్య, నిందితుల ఎన్​కౌంటర్​ తదితర అంశాలతో స్క్రిప్ట్​ సిద్ధం చేసుకొని, హీరోయిన్​ సమంతకు వినిపించాడట. ప్రయోగాత్మక చిత్రాలు చేయడంలో ముందుండే ఈ భామ.. ఇందుకు ఒప్పుకుందట. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ప్రస్తుతం '96' తెలుగు రీమేక్​తో పాటు, 'ద ఫ్యామిలీ మ్యాన్' వెబ్​ సిరీస్ రెండో​ సీజన్​లో నటిస్తోంది సమంత. ఈ సిరీస్​లో ప్రతినాయక ఛాయలున్న ఉగ్రవాది పాత్రలో కనిపించనుందని సమాచారం. మరి అది నిజమో, కాదో తెలియాలంటే వచ్చే వరకు ఆగాల్సిందే.

ఇది చదవండి: ఆగస్టులో బిడ్డకు జన్మనివ్వబోతున్న సమంత!

ABOUT THE AUTHOR

...view details