ఇటీవల తన భర్త నాగ చైతన్యతో(chaysam divorce) విడిపోయిన తర్వాత హీరోయిన్ సమంత కెరీర్ విషయంలో జోరు పెంచింది. ఇప్పటికే రెండు కొత్త సినిమాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మరో కొత్త ప్రాజెక్ట్‌కు(samantha movies) ఓకే చెప్పిందని తెలుస్తోంది. తెలుగులో తెరకెక్కబోయే ఓ కొత్త వెబ్‌సిరీస్‌లో నటించేందుకు ఆమె అంగీకరించినట్లు టాక్.
ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం సామ్‌తో వెబ్‌సిరీస్ చేసేందుకు ఆసక్తిగా ఉందట. ఆమెతో చర్చలు కూడా జరిపిందని తెలిసింది. కథ నచ్చి సామ్ కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. త్వరలోనే దీనిపై అధికార ప్రకటన వచ్చే అవకాశముంది. ఇప్పటికే ఆమె 'ఫ్యామిలీ మ్యాన్ 2'(samantha family man 2 release date) వెబ్‌సిరీస్‌లో నటించి దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.