ఇప్పటివరకు చాలా సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న సమంత అక్కినేని.. అరుదైన రికార్డు సృష్టించింది. 'ద ఫ్యామిలీ మ్యాన్ 2' సిరీస్‌తో వెబ్ ఎంట్రీ ఇచ్చిన సామ్.. ట్విట్టర్ ఏమోజీ దక్కించుకున్న దక్షిణాది తొలి నటిగా నిలిచింది. అంతకు ముందు హీరోల్లో విజయ్, రజినీకాంత్ తదితరులకు ట్విట్టర్ ఏమోజీలు వచ్చాయి.
సమంత రికార్డు.. దక్షిణాదిలోనే తొలి నటిగా - the family man 2 web series
తన ఫొటోతో ట్విట్టర్ ఏమోజీ పొందిన సమంత.. ఈ ఘనత సాధించిన దక్షిణాది తొలి నటిగా నిలిచింది. అంతకు ముందు పలువురు హీరోలు మాత్రమే ఈ రికార్డు సాధించారు.
సమంత రికార్డు.. దక్షిణాదిలోనే తొలి నటిగా
ఈ ఏమోజీల్లో సమంత ఆర్మీ దుస్తుల్లో కనిపిస్తోంది. దీంతో అభిమానుల మదిలో రకరకాల సందేహాలు వస్తున్నాయి. 'ద ఫ్యామిలీ మ్యాన్ 2' ఉగ్రవాది పాత్రలో సమంత నటించిందంటూ తొలుత వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఏమోజీల్లో వేరే ఫొటో ఉండటం ఆసక్తి రేకెత్తిస్తోంది. అమెజాన్ ప్రైమ్‌లో వచ్చే నెల 12 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.
ఇవీ చదవండి: