తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బన్నీతో సమంత.. 'పుష్ప'లో ఈసారి స్పెషల్ సాంగ్! - trivikram next movie

ముద్దుగుమ్మ సమంత(samantha movies) క్రేజీ నిర్ణయం తీసుకుందట. 'పుష్ప'(pushpa release date) స్పెషల్ సాంగ్​లో నర్తించేందుకు గ్రీన్​సిగ్నల్​ ఇచ్చిందని సమాచారం. త్వరలో ఈ విషయమై క్లారిటీ రానుంది.

samantha special song in pushpa movie
సమంత పుష్ప మూవీ

By

Published : Nov 14, 2021, 3:09 PM IST

నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత హీరోయిన్​ సమంత(samantha akkineni husband) కెరీర్​ విషయంలో జోరు పెంచింది. వరుసగా సినిమాలకు గ్రీన్​సిగ్నల్​ ఇస్తోంది. అయితే ఇప్పుడు సామ్​ గురించి ఓ ఆసక్తికర వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

సమంత

ఇప్పటివరకు హీరోయిన్​గా అలరించిన సమంత(samantha movies list).. ఈ సారి స్పెషల్​ సాంగ్​తో అభిమానులను అలరించనుందని సమాచారం. అల్లుఅర్జున్​(allu arjun new movie) హీరోగా నటిస్తున్న 'పుష్ప'(pushpa release date) చిత్రంలోనే ఈ ముద్దుగుమ్మ ప్రత్యేక గీతంలో నర్తించనుందని టాక్ వినిపిస్తోంది. త్వరలోనే దీనిపై అధికార ప్రకటన వచ్చే అవకాశముందట.

పుష్ప మూవీలో అల్లు అర్జున్

ఈ వార్తలతో బన్నీ, సామ్​ ఫ్యాన్స్​ తెగ సంతోషపడిపోతున్నారు. ఇప్పటికే స్టార్​ హీరోయిన్లు అనుష్క, కాజల్​, తమన్నా, పూజాహెగ్డే(pooja hegde movies) ఇలా పలువురు ముద్దుగుమ్మలు కూడా కొన్ని చిత్రాల్లో స్పెషల్​ సాంగ్స్​తో మెప్పించారు.

మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్​తో నిర్మిస్తున్న 'పుష్ప' చిత్రాన్ని(pushpa movie songs) స్టైలిష్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ తెరకెక్కిస్తుండగా(sukumar alluarjun movie) హీరోయిన్​గా రష్మిక నటిస్తోంది(alluarjun rashmika movie). సునీల్​, ఫహాద్‌ ఫాజిల్‌ ప్రతినాయకులు. 'పుష్ప ది రైజ్‌' పేరుతో మొదటి భాగాన్ని ఈ డిసెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

సామ్​.. త్వరలోనే 'శాకుంతలం'(shakuntalam release date), 'కాతు వాకుల రెండు కాదల్'​ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతోపాటే ఈ మధ్యలో రెండు బడా ద్విభాషా ప్రాజెక్ట్​లకు అంగీకారం తెలిపింది. అంతకుముందు అల్లుఅర్జున్​, సమంత కలిసి త్రివిక్రమ్​(trivikram next movie) దర్శకత్వంలో వచ్చిన 'సన్​ ఆఫ్​ కృష్ణమూర్తి' సినిమాలో నటించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details