హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న సరికొత్త చిత్రం 'శాకుంతలం'. సోమవారం ఈ సినిమా షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది. దీనికి సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేసింది చిత్రబృందం. మహాభారతంలోని ఆదిపర్వంలో శకుంతల, దుష్యంతుల ప్రేమకథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో సమంత.. శకుంతల పాత్ర పోషించగా.. మలయాళ నటుడు దేవ్ మోహన్ దుష్యంత్ పాత్రలో కనిపించనున్నారు.
సుజిత్ రెడ్డి, తరుణిక సింగ్ జంటగా తెరకెక్కుతున్న సినిమా 'చేరువైన.. దూరమైన'. కె.ఎస్.ఎన్.చందు దర్శకత్వం వహిస్తున్నారు. ఇవాళ విడుదలైన ఈ సినిమా టీజర్ ఆకట్టుకుంటోంది.