Bheemlanayak pre release event: నేడు(సోమవారం) జరగాల్సిన 'భీమ్లానాయక్' ప్రీ రిలీజ్ వేడుక వాయిదా పడింది. ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం వల్ల ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు తెలిపారు హీరో పవన్‌కల్యాణ్. "ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలిలో కీలక బాధ్యతల్లో ఉన్న శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం వల్ల నెలకొన్న ఈ విషాద సమయంలో భీమ్లా నాయక్ సినిమా వేడుక చేసుకోవడానికి నా మనసు అంగీకరించడం లేదు. అందుకే నేడు జరగాల్సిన 'భీమ్లా నాయక్' ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని నిర్ణయించాం. ఈ వేడుక త్వరలోనే జరుగుతుంది. వివరాలను చిత్ర నిర్మాణ సంస్థ తెలియజేస్తుంది." అని పవన్ పేర్కొన్నారు.
'శాకుంతలం' ఫస్ట్‌లుక్