తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'చైతూతో విడిపోయాక చచ్చిపోతానేమో అనుకున్నా.. కానీ' - సమంత నాగచైతన్య విడాకులు

Chaysam Divorce: నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత తాను ఎంత బలవంతురాలినో అర్థమైందని చెప్పింది హీరోయిన్ సమంత. అందుకు తానెంతో గర్వంగా భావిస్తున్నట్లు తెలిపింది.

సమంత డివర్స్​, సమంత నాగచైతన్య, samantha divorce
సమంత డివర్స్​, సమంత నాగచైతన్య

By

Published : Dec 7, 2021, 1:44 PM IST

Chaysam Divorce: యువహీరో నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత కెరీర్​ మరింత జోరుగా ముందుకెళ్తోంది. సోషల్​మీడియాలోనూ చురుగ్గా ఉంటూ స్ఫూర్తినిచ్చే వ్యాఖ్యలను పోస్ట్​ చేస్తోంది సామ్. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ చైతూతో విడిపోయిన తర్వాత తన జీవితం ఎలా ఉందనే విషయమై మాట్లాడింది. విడాకులు తీసుకున్న తర్వాత తాను ఎంత బలవంతురాలినో అర్ధమైనట్లు తెలిపింది. అందుకు తాను గర్వంగా భావిస్తున్నట్లు పేర్కొంది.

"మన సమయం బాగోలేదంటే వీలైనంత త్వరగా దాన్ని స్వీకరించాలి. అర్థం చేసుకోవాలి. అప్పుడు సగం భారం తగ్గిపోతుంది. అదే మనం ఆ పరిస్థితిని స్వీకరించలేకపోతే దానితో జీవితాంతం పోరాడుతూనే ఉండాలి. 'ఇది నా సమస్య, అయితే ఏంటి? జీవించాల్సిందేగా' అని మీరు భావిస్తే జీవితం ముందుకు వెళ్తుంది. నా వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న సమస్యలతో ఇంకా నేను పోరాడుతూనే జీవిస్తున్నా. అయితే ఈ క్రమంలో నేను ఎంత బలవంతురాలినో అర్థమైంది. మొదట నేను బలహీనురాలినని భావించేదానిని. విడాకులు తీసుకున్న తర్వాత కుంగిపోతాను, చచ్చిపోతానేమో అని అనిపించింది. కానీ నేను అలా లేను. ఇలాంటి పరిస్థితుల్లో ఇంత బలంగా ఉంటానని అస్సలు ఊహించలేదు. ఈరోజు ఇలా ఉండటాన్ని ఎంతో గర్వంగా భావిస్తున్నా."

-సమంత, హీరోయిన్​.

కెరీర్​ గురించి మాట్లాడుతూ.. తాను కింద స్థాయి నుంచి ఉన్నత స్థాయికి చేరుకున్నట్లు చెప్పింది సామ్​. తన తొలి చిత్రం విజయం సాధించినప్పుడు తానేమీ సంతోషపడలేదని తెలిపింది. "నేను నా కెరీర్​ను ఏమీ లేని స్థాయి నుంచి ప్రారంభించి ఇక్కడికి వరకు వచ్చాను. తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకున్నాను. 'ఈ అమ్మాయి జాక్​పాట్​ కొట్టింది. ఆనందంలో మునిగితేలుతుంటుంది' అని చాలా మంది అనుకుని ఉంటారు. కానీ నేను అలా లేను. 'నాకు ఎందుకు ఈ విజయం దక్కింది. దీనికి నేను అర్హురాలిని కాదు' అని అనిపించేది. పెద్ద ప్రాజెక్టులు చేసినప్పటికీ, ఎంతో మంది అభిమానుల ప్రేమను పొందినప్పటికీ అలానే అనిపించేది. నాలో నేనే మదనపడేదానిని. కానీ ఇప్పుడు అలా ఆలోచించడం మానేశా" అని సామ్​ పేర్కొంది.

సమంత త్వరలోనే గుణశేఖర్​ దర్శకత్వం వహించిన 'శాకుంతలం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే బన్నీతో 'పుష్ప' చిత్రంలో ఐటమ్​ సాంగ్​లో చిందేయనుంది. దీంతో పాటే పలు భారీ చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఇదీ చూడండి: 'యశోద'గా సమంత.. ఈసారి అలాంటి కథతో సాహసం

ABOUT THE AUTHOR

...view details