తెలంగాణ

telangana

By

Published : Dec 16, 2019, 3:24 PM IST

ETV Bharat / sitara

విలన్​గా కనిపించనున్న సమంత

'ది ఫ్యామిలి మ్యాన్​ 2' వెబ్​సిరీస్​లో సమంత ప్రతినాయిక పాత్ర పోషిస్తోంది. ఇందులో బాలీవుడ్​ నటుడు మనోజ్​ బాజ్​పేయ్​ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.

samantha play villain role in web series movie the family man 2
విలన్​గా కనిపించనున్న సమంత

వైవిధ్యమైన పాత్రల్లో నటించి సినీ ప్రేక్షకులను మెప్పిస్తుంది ప్రముఖ నటి సమంత అక్కినేని. ఇటీవల సామ్​ ప్రధాన పాత్రలో వచ్చిన 'యూటర్న్', 'ఓ బేబి' వంటి సినిమాలు అందుకు నిదర్శనంగా నిలిచాయి. ఓ పక్క కథానాయికగా చేస్తూనే మరోవైపు సోలో పాత్రల్లోనూ నటించి కనిపిస్తుంటుంది సమంత. తాజాగా 'ది ఫ్యామిలి మ్యాన్‌2'వెబ్‌సీరీస్‌లో ప్రతినాయిక ఛాయలున్న పాత్ర పోషిస్తుంది. యాక్షన్‌ డ్రామాగా ఈ సిరీస్ తెరకెక్కనుంది.

రాజ్‌ నిడమూరు, కృష్ణ.డి.కేలు కలిసి సంయుక్తంగా ఈ సిరీస్​ను తెరకెక్కిస్తున్నారు. ఇందులో బాలీవుడ్‌ నటుడు మనోజ్‌ బాజ్‌పేయి ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం తమిళంలో వచ్చిన '96' తెలుగు రీమేక్​లో సమంత కథానాయిక. శర్వానంద్ హీరోగా నటిస్తున్నాడు.

ఇదీ చదవండి:'మమత నిర్ణయం హింసను ప్రేరేపించేదిగా ఉంది'

ABOUT THE AUTHOR

...view details