స్టార్ హీరోయిన్ సమంత నటించిన తొలి వెబ్‌సిరీస్ 'ది ఫ్యామిలీ మ్యాన్-2' అమెజాన్ ప్రైమ్ వేదికగా త్వరలోనే విడుదల కానుంది. ఈ సందర్భంగా ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడిన సామ్.. బాలీవుడ్, దక్షిణాది చిత్రపరిశ్రమల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వివరించారు.
'ఆ విషయంలో బాలీవుడ్‌కు ఒత్తిడి తక్కువ' - బాలీవుడ్ దక్షిణాది సినిమాల మధ్య వ్యత్యాసం
దక్షిణాది చిత్రపరిశ్రమలతో పోలిస్తే బాలీవుడ్లో సినిమాల నిర్మాణంలో పెద్దగా ఒత్తిడి ఉండదని అంటున్నారు స్టార్ హీరోయిన్ సమంత. నిర్దిష్టమైన శైలిని ఇష్టపడే ప్రేక్షకులే లక్ష్యంగా చిత్రాన్ని రూపొందించవచ్చని.. ఈ విధంగా దక్షిణాది పరిశ్రమల్లో కుదరదని సామ్ అభిప్రాయపడ్డారు.
ఆ విషయంలో బాలీవుడ్‌కు ఒత్తిడి తక్కువ: సమంత
"బాలీవుడ్లో ఒక నిర్దిష్టమైన శైలిని ఇష్టపడే ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుని సినిమా చేయడానికి స్వేచ్ఛ ఉంటుంది. ప్రతి ఒక్కరి అంచనాలను చేరుకోవాలన్న ఒత్తిడి ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. కానీ, దక్షిణాది చిత్రపరిశ్రమల విషయంలో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. ప్రతి ఒక్క ప్రేక్షకుడిని థియేటర్‌కు రప్పించాలనే ఉద్దేశంతో సినిమా రూపొందించాల్సి ఉంటుంది" అని సమంత పేర్కొన్నారు.
ఇదీ చూడండి:'జిమ్‌లు లేక 45 అంతస్తులు ఎక్కిదిగేదాన్ని'