తెలుగు చిత్ర పరిశ్రమలో సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది 'రంగస్థలం'. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌తో దర్శకుడు సుకుమార్ తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఇందులో చెర్రీ చెవిటివాడైన చిట్టిబాబు పాత్రలో జీవించాడని చెప్పొచ్చు. కథానాయిక సమంత అదే స్థాయిలో నటించి ప్రేక్షకుల హృదయాల్లో నిలిచింది. సహజమైన నటనతో పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపించి ఔరా అనిపించింది. అగ్ర కథానాయికగా సాగుతున్న సమయంలో, వివాహ అనంతరం ఎవరైనా ఇలాంటి పాత్రల్లో కనిపించడం సాహసమే. అలాంటిది సమంత తానేంటో నిరూపించుకుంది. రామలక్ష్మీ అనే పాత్ర ఆమె కెరీర్‌కే ఎంతో పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చింది. అయితే, దర్శకుడు సుకుమార్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా సమంతను తీసుకోవాలనుకోలేదట.
'రంగస్థలం'లో సమంతను వద్దనుకున్నారట! - 'రంగస్థలం'లో సమంతను వద్దనుకున్నారట!
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, సమంత ప్రధానపాత్రల్లో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కి ఘనవిజయం సాధించిన చిత్రం 'రంగస్థలం'. అయితే ఈ చిత్రంలో హీరోయిన్‌గా మొదట సమంతను అనుకోలేదట. అందుకు గల కారణాన్ని ఓ సందర్భంలో వెల్లడించారు దర్శకుడు సుకుమార్.
'రంగస్థలం'లో సమంతను వద్దనుకున్నారట!
ఎందుకంటే? "నేను ఇద్దరు అగ్ర నటుల్ని (చెర్రీ, సామ్) మ్యానేజ్ చేయలేనేమో అనిపించింది. పల్లెటూరి అమ్మాయిగా కనిపించాలంటే కొత్త ముఖం కావాలి. ఇందుకు తెలుగు వచ్చిన మరో నటిని ఎంపిక చేస్తే సరిపోతుందని అనుకుని సమంతను వద్దనుకున్నా. కానీ, చివరకు సామ్‌కే ఆ పాత్ర లభించింది. చిత్రీకరణలో పాల్గొని ఆమె నటిస్తున్నప్పుడు నన్ను కొట్టినట్లు అనిపించేది. ఇలాంటి నటినా? నేను వద్దనుకుంది" అని ఫీల్ అయ్యానని ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు సుకుమార్.