తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Samantha movies: పదేళ్ల తర్వాత నానితో సమంత.. ఆ సినిమాలో! - కీర్తి సురేశ్ సమంత

సమంత(samantha akkineni movies).. తెలుగులో మరో సినిమా ఒప్పుకొనుందా? అంటే అవుననే అనిపిస్తోంది. నానితో(nani new movie) కలిసి మూడోసారి అలరించేందుకు సిద్ధమవుతోందట.

Samantha likely to reunite with Nani
నాని సమంత

By

Published : Oct 31, 2021, 2:23 PM IST

దాదాపు పదేళ్ల విరాం తర్వాత నేచురల్ స్టార్ నానితో సమంత(samantha akkineni movies) నటించనున్నట్లు తెలుస్తోంది. నాని కొత్త సినిమా 'దసరా'లో(nani new movie) కీలక పాత్ర కోసం ఆమెను సంప్రదించారట. ఆమె కూడా దీనికి అంగీకారం చెప్పే యోచనలో ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే వీరు కలిసి నటించే మూడో చిత్రం ఇది అవుతుంది.

తెలంగాణలోని సింగరేణి బొగ్గు గనుల(singareni coal mine) నేపథ్యంగా ఈ సినిమా తీయనున్నారు. సుకుమార్(sukumar movies) శిష్యుడు శ్రీకాంత్ ఓదెల.. 'దసరా'తో దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

నాని-సమంత.. 'ఎటో వెళ్లిపోయింది మనసు', 'ఈగ' సినిమాల్లో(eega movie) జంటగా నటించారు. నాని-కీర్తి సురేశ్(keerthy suresh movies).. 'నేను లోకల్' చిత్రంతో మెప్పించారు. కీర్తి సురేశ్-సమంత.. 'మహానటి'(mahanati movie) సినిమాలో కలిసి నటించారు. ఇప్పుడు వీరందరూ కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారనే విషయం ఆసక్తి కలిగిస్తోంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details