Samantha Latest News: నటిగా పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి సూపర్ సక్సెస్ అయిన సమంత.. తాజాగా తన అదృష్టాన్ని పెట్టుబడుల రూపంలో పరీక్షించుకోనున్నారు. అవును 'సస్టెయిన్ కార్ట్' అనే ఈ- కామర్స్ సంస్థలో సమంత ఇన్వెస్ట్ చేశారు. ఈ సంస్థను గతేడాది ప్రారంభించారు. ఇప్పటికే పలు సంస్థల్లో పెట్టుబడులు పెట్టి మంచి లాభాలు ఆర్జిస్తున్న పలువురు సెలబ్రిటీల బాటలోనే సామ్ నడుస్తున్నారు.
సస్టెయిన్ కార్ట్ ఫ్లకార్డ్‌తో సమంత సస్టెయిన్ కార్ట్‌లో ఇన్వెస్ట్ చేసిన సమంత చైతూ రెస్టారెంట్ బిజినెస్..
chaitanya akkineni: కొద్దిరోజుల క్రితం హీరో నాగచైతన్య కూడా ఓ రెస్టారెంట్ బిజినెస్‌ను ప్రారంభించారు. 'షోయూ' పేరుతో పాన్ ఆసియా రుచులను ఇందులో అందిచనున్నారు. ఇటీవల సమంతతో విడాకులు తీసుకున్న నాగచైతన్య ప్రస్తుతం.. 'థాంక్యూ' సినిమా చేస్తున్నారు. త్వరలో ఓ వెబ్ సిరీస్‌లోనూ నటించేందుకు సిద్ధమవుతున్నారు.
బాలీవుడ్‌లోనూ..
బాలీవుడ్ టాప్ హీరోయిన్లు కత్రినా కైఫ్, ఆలియా భట్.. గతేడాది నైకా అనే ఈ కామర్స్ సంస్థలో పెట్టుబడులు పెట్టారు. ఐపీఓకు ముందే నైకాలో పెట్టుబడులు పెట్టిన వీరిద్దరూ ఇప్పుడు 10 రెట్లకు పైగా లాభాలు గడించారు.
తన కాయ్ బ్యూటీ ఉత్పత్తులను నైకాలో లాంచ్ చేసిన ఏడాది తర్వాత ఆ సంస్థలో పెట్టుబడులు పెట్టింది కత్రినా. ఈ బ్రాండ్ విజయవంతంగా వృద్ధి చెందాక మరింత ఆసక్తితో వాటాలు కొనుగోలు చేసింది. 2018లో రూ.2.02కోట్లతో చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టింది.
మరో బాలీవుడ్ యువనటి ఆలియా భట్ నైకాపై కాస్త ఎక్కువ నమ్మకమే ఉంచింది. ఇందులో రూ.4.95కోట్లు పెట్టుబడి పెట్టింది. అయితే నైకా ఐపీఓ అత్యంత విజయవంతం కావడం వల్ల వీరిద్దరి వాటాల విలువ ఒక్క రోజులోనే 10 రెట్లుకు పైగా వృద్ధి చెందింది.
ఇదీ చూడండి:వాళ్లే నా జీవితాన్ని నాశనం చేశారు: పూనమ్ కౌర్