ఈ ప్రపంచాన్ని మార్చాలనుకుంటే ముందు తనని తాను మార్చుకుంటానని అగ్రకథానాయిక సమంత(samantha latest news) అంటున్నారు. ఇటీవల చైతూ-సామ్ విడిపోతున్నట్లు ప్రకటించడం వల్ల ప్రస్తుతం వాళ్లిద్దరే టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు. ఈ నేపథ్యంలో సమంత చేసిన తాజా పోస్ట్(samantha instagram post) ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
"ఈ ప్రపంచాన్ని మార్చాలనుకుంటే నన్ను నేను మార్చుకోవాలి. నా పడకగదిని నేను సిద్ధం చేసుకోవాలి. ఇంటిని పరిశుభ్రం చేసుకోవాలి. మధ్యాహ్నం వరకూ నిద్రపోకూడదు. ఇక, పగటి కలలు కనడం మానేసి.. చేయాల్సిన పనులపైనే దృష్టి పెట్టాలి" అని సమంత ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేశారు.