తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'మన్మథుడు-2' షూటింగ్​లో సమంత - tollywood

'మన్మథుడు-2' సినిమా షూటింగ్​లో హీరోయిన్​ సమంత జాయిన్ అయింది. ఈ సినిమాలో అతిథి పాత్రలో సందడి చేయనుంది అక్కినేని కోడలు.

సమంత

By

Published : May 1, 2019, 8:41 PM IST

నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ ప్రధానపాత్రల్లో నటిస్తున్న 'మన్మథుడు-2' సినిమా చిత్రీకరణ​లో సమంత జాయిన్ అయింది. బెస్ట్ ఫ్రెండ్స్ కలిసి పని చేస్తున్నాం..అంటూ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ట్వీట్ చేశాడు.

ఇటీవల 'మజిలీ' సినిమాతో సూపర్ హిట్ అందుకుంది సమంత. ప్రస్తుతం 'మన్మథుడు 2' షూటింగ్​లో పాల్గొంటోంది. చి.ల.సౌ ఫేమ్ రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. అక్కినేని నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ పోర్చుగల్​లో జరుగుతోంది. సినిమాలో సమంత అతిథి పాత్రలో నటిస్తుంది.

చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో కన్నడ నటి అక్షరా గౌడ కూడా కీలక పాత్రలో నటిస్తుంది. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రం దసరాకు విడుదలకానుంది.

ABOUT THE AUTHOR

...view details