Samantha liger song: విడాకులు అనంతరం కెరీర్‌లో స్పీడ్ పెంచారు నటి సమంత. వరుస ప్రాజెక్ట్‌లు చేస్తూ మరోసారి ప్రేక్షకుల మది గెలుచుకునేందుకు ఆమె తాపత్రయపడుతున్నారు. ఈ క్రమంలో ఆమె తొలిసారి ఓ ఐటమ్ సాంగ్‌లో తళుక్కున మెరిశారు. 'పుష్ప' సినిమా కోసం 'ఊ అంటావా మావ' అంటూ బన్నీతో కలిసి స్టెప్పులేశారు. సమంత వేసిన స్టెప్పులతో ఈ పాటకు మరింత క్రేజ్ వచ్చింది. సుమారు రెండు వారాల క్రితం విడుదల చేసిన ఈ పాట ఫుల్ వీడియో 73 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది.
Vijay devarakonda liger movie: ఇప్పుడు సమంతను మరో క్రేజీ ఆఫర్ వరించినట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ 'లైగర్' సినిమాలో సామ్‌కు ఛాన్స్ వచ్చినట్లు సమాచారం. కిక్ బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో ఓ స్పెషల్ సాంగ్ ఉందట. ఆ పాట కోసం ఎవరైనా స్టార్ హీరోయిన్‌ను ఎంచుకోవాలని పూరీ జగన్నాథ్, ఆయన టీమ్ భావిస్తోందట.