తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'సామ్‌జామ్‌'లో 'చైసామ్'​కు వేళాయె - నాగచైన్యతో సమంత ఇంటర్యూ

'ఆహా' వేదికగా సమంత వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న 'సామ్ జామ్' టాక్​ షోకు అక్కినేని నాగచైతన్య అతిథిగా విచ్చేశారు. ఈ విషయాన్ని 'ఆహా' తమ ట్విట్టర్​ ఖాతాలో పేర్కొంది.

Nagachaitanya in Sam jam talk show
'సామ్‌జామ్‌'లో 'చైసామ్'​కు వేళాయె

By

Published : Jan 3, 2021, 7:42 PM IST

సమంత అక్కినేని వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'సామ్‌జామ్‌' కార్యక్రమానికి నాగచైతన్య అతిథిగా విచ్చేశారు. 'ఆహా'లో ప్రసారమవుతున్న ఈ టాక్‌షోకు ఇప్పటివరకు చాలామంది సెలబ్రిటీలు అతిథులుగా వచ్చి అలరించారు. ఇప్పుడు చైతూ రావడం షోపై ఆసక్తి పెంచుతోంది. ప్రముఖ సెలబ్రిటీ జోడీగా పేరొందిన 'చైసామ్‌' చేసే సందడి ప్రేక్షకులను కచ్చితంగా అలరించనుంది.

'చైసామ్' జంట

ఈ మేరకు ఆహా తన ట్విట్టర్​లో షోకు సంబంధించి వీరిద్దరి ఫొటోలు ఉంచి ''చైసామ్‌' కెమెస్ట్రీ చూడడానికి సిద్ధంగా ఉండండి' అంటూ పోస్ట్‌ చేసింది. ఇటీవలే కొత్త సంవత్సర వేడుకలను ఈ జంట గోవాలో జరుపుకొంది. సమంత ఈ టాక్‌షో ద్వారా చిరంజీవి, అల్లు అర్జున్‌, విజయ్ దేవరకొండ, తమన్నా, రకుల్‌ వంటి టాప్‌ సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసింది.

ఇదీ చదవండి:మెగాస్టార్​ 'లూసిఫర్'​ రీమేక్​లో నయనతార!

ABOUT THE AUTHOR

...view details