Samantha insta post remuneration: విడాకుల అనంతరం స్టార్ హీరోయిన్ సమంత కెరీర్లో జోరు ప్రదర్శిస్తున్నారు. వాణిజ్య ప్రకటనల్లోనూ దూకుడు ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా సోషల్‌మీడియాలో చురుగ్గా ఉంటున్నారు. ఓ వైపు స్ఫూర్తిదాయకమైన పోస్టులు పెడుతూనే.. మరోవైపు తనను విమర్శించినవారికి దీటుగా సమాధానం చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఆమె పెట్టే పోస్టులను వీక్షించడానికి నెటిజన్లు ఆసక్తి కనబరుస్తున్నారు.
ఒక్కో ఇన్‌స్టా పోస్ట్‌కు సమంత సంపాదన ఎంతంటే? - సమంత రెమ్యునరేషన్
Samantha insta post remuneration: గత కొద్ది కాలంగా హీరోయిన్ సమంత సోషల్‌మీడియాలో చురుగ్గా ఉంటున్నారు. అలానే నెటిజన్లు కూడా ఆమె పెట్టే పోస్ట్‌లను వీక్షించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె ఈ పోస్ట్‌ల ద్వారా ఎంత ఆర్జిస్తున్నారో వార్త ఒకటి బయటకు వచ్చింది. ఇంతకీ ఆమె ఒక్కో పోస్ట్ విలువ ఎంతో తెలుసుకుందాం..
దీంతో చాలా బ్రాండ్లు తమ ఉత్పత్తులను ప్రమోట్ చేసేందుకు సమంత ఇన్‌స్టాను వేదికగా మలుచుకుంటున్నాయి. ఈ క్రమంలోనే సామ్‌కు వాణిజ్య ప్రకటన డిమాండ్ పెరిగిపోయింది. పెట్టే ప్రతి పోస్ట్‌కు రూ.25లక్షల నుంచి రూ.30లక్షల వరకు సామ్ ఆర్జిస్తున్నట్లు తెలిసింది. కేవలం పోస్ట్‌లకు మాత్రమే ప్రత్యేకించి ఏమైనా ఫొటోషూట్స్, వీడియోలు చేయాల్సి వస్తే వాటికి అదనంగా రెండు నుంచి మూడు రెట్లు ఎక్కువ డిమాండ్ చేస్తున్నారని వినికిడి. దీని ప్రకారం ఆమె సినిమాల పరంగానే కాకుండా.. సోషల్‌మీడియా పోస్ట్‌ల ద్వారా కూడా బాగానే ఆర్జిస్తున్నట్లు అంతా మాట్లాడుకుంటున్నారు. త్వరలోనే ఆమె గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'శాకుంతలం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
ఇదీ చూడండి: విల్‌స్మిత్ ఆస్కార్‌ను వెనక్కి తీసేసుకుంటారా?