అందాల నటి సమంత తన స్నేహితురాలి వివాహ వేడుకకు హాజరైంది. క్రైస్తవ పద్ధతిలో జరిగిన ఈ వేడుకలో తన స్నేహితులతో ఆనంద క్షణాలు గడిపింది సామ్. తన జీవితంలో ఎంతో ముఖ్యమైన స్నేహితులు వీరేనంటూ గ్రూప్ ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ ఫొటోలో అందరూ చిరునవ్వు చిందిస్తూ కనిపించారు.
తోటి పెళ్లికూతురిగా సమంత సందడి - bridemaid
టాలీవుడ్ హీరోయిన్ సమంత ఇటీవల తన స్నేహితురాలి పెళ్లి వేడుకకు హాజరైంది. అందులో తోడిపెళ్లికూతురిగా వధువుతో ఉన్న ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి.
భర్త నాగచైతన్యతో కలిసి చేసిన మజిలీ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. సమంత త్వరలో 'ఓ బేబీ' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా... నిర్మాణ అనంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.
తమిళంలో సూపర్ సక్సెస్ సాధించిన 96 రీమేక్‌లో శర్వానంద్ సరసన కథానాయికగా నటిస్తోంది సమంత. ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే ప్రారంభం కాగా, త్వరలోనే బృందంతో కలవనుంది సామ్. దిల్ రాజు నిర్మాణంలో 96 తెలుగు రీమేక్ రూపొందుతోంది.