ఈ ఏడాది వరుస హిట్లతో అలరించిన స్టార్ హీరోయిన్ సమంత.. తర్వాత సినిమా గురించిన ఆసక్తికర విషయం బయటకొచ్చింది. త్వరలో ఓ హారర్ సినిమాలో నటించనుందని టాక్. ఇది రెండు భాషల్లో(తెలుగు-తమిళం) రూపొందనుందట.ప్రస్తుతం 'ద ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్‌లో నటిస్తోందీ భామ.
ద్విభాషా హారర్ సినిమాలో సమంత - హారర్ థ్రిల్లర్
ఈ ఏడాది 'మజిలీ', 'సూపర్ డీలక్స్', 'ఓ బేబీ' చిత్రాలతో ప్రేక్షకాదరణ పొందిన ముద్దుగుమ్మ సమంత.. త్వరలో ఓ హారర్ సినిమాలో నటించనుందట. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయని సమాచారం. ఈ ప్రాజెక్టును తెలుగు-తమిళంలో ఏకకాలంలో రూపొందించనున్నారని టాక్.
ద్విభాషా హారర్ సినిమాలో సమంత
తాప్సీతో 'గేమ్ ఓవర్' లాంటి హారర్ థ్రిల్లర్‌ను తెరకెక్కించిన దర్శకుడు శరవణన్.. సమంతతో సినిమా తీసేందుకు సిద్ధమవుతున్నాడు. తెలుగులో ఈమెనే నిర్మించనుందని సమాచారం. వీటిన్నింటికి సమాధానం దొరకాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే.
ఇదీ చదవండి:- స్టార్ బర్త్‌డే స్పెషల్: హమారా భాయ్‌జాన్.. సల్మాన్‌ఖాన్