తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అలాంటి బలం అందరికీ అవసరమే: సమంత - కెరీర్ గురించి సమంత

వరుస విజయాలతో జోరు చూపిస్తోంది అక్కినేని కోడలు సమంత. నటిగా తనదైన ప్రభావం చూపిస్తోంది. అయితే దీనిపై స్పందించిందీ నటి.

samantha
సమంత

By

Published : Jan 15, 2020, 6:53 AM IST

సమంత జీవితంలో చాలా దశలు ఉన్నాయి. ఆటుపోట్లతో కూడిన ఆ దశలన్నీ తనకి కఠినపాఠాల్నే నేర్పాయని చెబుతోందామె. ఇప్పుడు వరుస విజయాలతో దూసుకెళుతోంది. నటిగా తనదైన ప్రభావం చూపిస్తోంది. ఇది అత్యుత్తమ దశ అనుకోవచ్చా? అని అడిగితే ఈ విధంగా స్పందించింది.

"నటిగా నేను అందుకుంటున్న అవకాశాలు, చేస్తున్న పాత్రలు నిజంగా నేనెంత అదృష్టవంతురాల్నో చెబుతున్నాయి. ఒకొక్క సినిమాతో ఒక్కో అడుగు ముందుకేసే అవకాశం దొరకడం గొప్ప పరిణామమే. ఇలాంటి దశని ఆస్వాదించాల్సిందే. కాకపోతే ఇదే మన జీవితం, ఎప్పుడూ ఇలాంటి దశలోనే ఉంటామని మాత్రం అనుకోకూడదు. ప్రయాణం ఎప్పుడూ ఒకలాగే ముందుకు సాగదు. మధ్యలో మళ్లీ ఒడుదొడుకులు ఎదురవుతాయి. వాటిని అధిగమించే బలాల్ని కూడా ఈ దశలోనే సంపాదించాలి. అలాంటి బలం అందరికీ అవసరమే. రేపు బాగుంటుందని నమ్ముతూనే మనం కొత్త పాఠాల్ని నేర్చుకుంటూ సాగాలి."
-సమంత, హీరోయిన్

ప్రస్తుతం సమంత శర్వానంద్​ సరనస 'జాను'లో నటిస్తోంది. తమిళంలో ఘనవిజయం సాధించిన '96'కు రీమేక్ ఇది. 'ఫ్యామిలీ మ్యాన్' వెబ్​సిరీస్​లోనూ నటించేందుకు అంగీకారం తెలిపింది.

సమంత

ఇవీ చూడండి.. శ్రీదేవి తర్వాత నువ్వే అన్నారు: పూజా హెగ్డే

ABOUT THE AUTHOR

...view details