'గ్రీన్ ఇండియా ఛాలెంజ్' ఒక యజ్ఞంలా ముందుకు సాగుతుంది. ఈ కార్యక్రమంలో పలువురు సెలబ్రెటీలు, రాజకీయ నాయకులతో పాటు అన్ని వర్గాల ప్రజలు మొక్కలు నాటుతూ తమ సామాజిక బాధ్యతను నెరవేరుస్తున్నారు. ఇటీవల ఇందులో భాగంగా మొక్కలు నాటిన టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున తన కోడలు సమంతకు ఛాలెంజ్ విసిరారు.
అయితే తాజాగా తన మామ ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించిన అక్కినేని కోడలు సమంత ఈ రోజు జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో నాగార్జునతోనే కలిసి మూడు మొక్కలు నాటారు.
"ఈ కార్యక్రమం చాలా గొప్పది. పెరిగిపోతున్న కాలుష్యానికి బ్రేక్ వేయడానికి ఇది ఒక ఆయుధంలా పనిచేస్తుంది. నా అభిమానులందరూ మూడు మొక్కలు నాటి ఈ ఛాలెంజ్‌ను మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాను."