తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఓ బేబీ' కోసం 'సామ్​'కు భారీ కటౌట్​ - నందినిరెడ్డి దర్శకురాలు

స్టార్‌ హీరో చిత్రం విడుదలవుతుందంటే చాలు అభిమానులకు పండగే. థియేటర్ల వద్ద వాళ్లు చేసే హంగామా అంతా ఇంతా కాదు. బ్యానర్లు, కటౌట్లు ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకుంటారు. ఇప్పటివరకు  హీరోలకే పరిమితం అనుకునే ఆ అభిమానం హీరోయిన్‌ సమంతకు దక్కింది.

'ఓ బేబీ' కోసం అభిమానుల భారీ కటౌట్​

By

Published : Jul 5, 2019, 8:20 AM IST

టాలీవుడ్‌ హీరోయిన్‌ సమంతకు భారీ కటౌట్ ​ ఏర్పాటు చేసి తమ ప్రేమను చాటుకున్నారు అభిమానులు. సామ్​ నటించిన ‘ఓ బేబీ’ సినిమా ఈ రోజు థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమా కోసమే.. హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లోని దేవి థియేటర్‌ వద్ద ఆమె అభిమానులు భారీ కటౌట్‌ ఏర్పాటు చేశారు. అంతెత్తు ఉన్న ఆ బొమ్మను చూస్తే సమంత 'బేబీ' కాదు.. బిగ్‌ బీ రేంజ్‌లో ఉందనిపిస్తోంది. హీరోయిన్‌కు ఇంత పెద్ద కటౌట్‌ ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి కావడం వల్ల చిత్ర బృందం హర్షం వ్యక్తం చేసింది.

అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కటౌట్​

ఈ చిత్రానికి నందినీ రెడ్డి దర్శకురాలు. సురేష్‌ ప్రొడక్షన్స్, పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ, గురు ఫిలిమ్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. నాగశౌర్య, లక్ష్మి, రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్‌ ప్రధాన పాత్రలు పోషించారు.

ABOUT THE AUTHOR

...view details