తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బెస్ట్ ఫ్రెండ్స్​తో సమంత.. విహారయాత్రలో సరదాగా! - Samantha flys to Dehradun with her bestie శ

ప్రముఖ హీరోయిన్ సమంత(samantha latest news) ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. నాగ చైతన్య(samantha naga chaitanya)తో వివాహ బంధానికి ముగింపు పలికిన ఈమె.. తన స్నేహితులతో కలిసి సరదాగా గడుపుతున్నారు. తాజాగా ఆమె సన్నిహితురాలు శిల్పారెడ్డిని కలిసిన సామ్.. విహారయాత్రతో బిజీగా ఎంజాయ్ చేస్తున్నారు.

Samantha
సమంత

By

Published : Oct 20, 2021, 5:26 PM IST

'శాకుంతలం' తర్వాత వ్యక్తిగత కారణాల వల్ల అగ్రకథానాయిక సమంత(samantha latest news) సినిమాల నుంచి కొంత బ్రేక్‌ తీసుకున్నారు. పరస్పర అంగీకారంతో నాగచైతన్య(samantha naga chaitanya)తో వైవాహిక జీవితానికి స్వస్తి చెప్పిన అనంతరం సామ్‌ సినిమాల్లో నటిస్తుందా? లేదా? అని అందరూ సందేహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తన కెరీర్‌పై నెటిజన్ల నుంచి వస్తోన్న ప్రశ్నలకు సమాధానమిస్తూ విజయదశమి రోజున తాను చేయనున్న తదుపరి ప్రాజెక్ట్‌లను ఆమె ప్రకటించారు. మరి కొన్నిరోజుల్లో వాటి రెగ్యులర్‌ షూట్‌ ప్రారంభం కానుంది. దీంతో, ఇప్పుడున్న ఖాళీ సమయాన్ని అన్నివిధాలుగా సద్వినియోగం చేసుకుంటున్నారీ ముద్దుగుమ్మ.

సమంత, శిల్పా రెడ్డి

తనకెంతో ఆప్తురాలైన శిల్పారెడ్డిని తాజాగా సామ్‌(samantha latest news) కలిశారు. ఆమె కుటుంబసభ్యులతో సరదాగా గడిపారు. 'టగ్‌ ఆఫ్‌ వార్‌'లో వీరు పోటాపోటీగా తలపడ్డారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలను వాళ్లిద్దరూ ఇన్‌స్టా(samantha instagram) వేదికగా షేర్‌ చేశారు. అందం, సరదా, ఆనందంతో కూడిన క్షణాలతో వారం త్వరగా గడిచిపోయిందని పేర్కొన్నారు. అనంతరం మంగళవారం సాయంత్రం సామ్‌-శిల్పా విహారయాత్ర కోసం దేహ్రాదూన్‌కు వెళ్లారు. ఆ విషయాన్ని తెలియజేస్తూ.. ఫ్లైట్‌లో దిగిన ఫొటోలతో పాటు దేహ్రాదూన్‌ అటవీ ప్రాంతాల్లో ట్రెక్కింగ్‌ చేస్తోన్న ఫొటోలు షేర్‌ చేశారు.

సమంత, శిల్పా రెడ్డి

ఇవీ చూడండి: బన్నీ కాదు.. 'ఆర్య 3'లో హీరోగా విజయ్ దేవరకొండ!

ABOUT THE AUTHOR

...view details