అందం, ఆకట్టుకునే అభినయంతో ఇన్నాళ్లు వెండితెరపై సందడి చేసిన సమంత.. ఇప్పుడు 'ఫ్యామిలీ మ్యాన్ 2' సిరీస్‌తో తొలిసారి ఓటీటీ మాధ్యమాలపై కనువిందు చేయబోతుంది. రాజ్ నిడమోరు, కృష్ణ డికే సంయుక్తంగా తెరకెక్కించిన వెబ్‌సిరీస్ ఇది. మనోజ్ బాజ్‌పాయ్ ప్రధాన పాత్రలో నటించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే ఓటీటీ వేదికగా అన్ని ప్రాంతీయ భాషల్లో సందడి చేయనుంది.
'ఫ్యామిలీ మ్యాన్ 2' కోసం సమంత తొలిసారి..? - సమంత హిందీ డబ్బింగ్
అక్కినేని కోడలు సమంత ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైంది. తను నటించిన వెబ్‌సిరీస్ 'ఫ్యామిలీమ్యాన్ 2' త్వరలోనే విడుదలకానుంది. అయితే ఈ సిరీస్ కోసం తొలిసారి హిందీలో డబ్బింగ్ చెప్పేందుకు సిద్ధమైందట సామ్.
సమంత
అయితే ఈ సిరీస్ కోసం సమంత తొలిసారి ఓ కొత్త ప్రయత్నం చేస్తోంది. ఈ వెబ్‌సిరీస్ కోసం హిందీలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోబోతుందట సామ్. ఇప్పటికే దీనికి తగ్గట్లుగా హిందీలో తన ప్రావీణ్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె ఈ సిరీస్‌లో తీవ్రవాదిగా కనిపించనున్నట్లు సమాచారం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలోనే అమెజాన్ ప్రైమ్ ద్వారా దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.