తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'అక్కినేని' ఫ్యాన్స్​కు షాకిచ్చిన సమంత - సమంత లేటెస్ట్ న్యూస్

హీరోయిన్​ సమంత సోషల్​మీడియాలో ఎవరూ ఊహించని పని చేసి అభిమానులను షాక్​కు గురి చేసింది. దీని గురించే నెటిజన్లు తెగ మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ ఏం చేసిందంటే?

samantha
సమంత

By

Published : Jul 31, 2021, 11:18 AM IST

సమంత అక్కినేని.. పెళ్లికి ముందు గ్లామర్​ పాత్రలతో అలరించిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం వైవిధ్యమైన కథలు, పాత్రలను ఎంచుకుంటూ కెరీర్​లో దూసుకెళ్తోంది. నటిగా, వ్యాపారవేత్తగా జోరు మీదున్న సామ్​.. సామాజిక మధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటూ అభిమానులతో టచ్​లో ఉంటుంది. అయితే ఇప్పుడు తన సోషల్​మీడియా అకౌంట్లలో అక్కినేని పేరుతో పాటు తన పేరును తొలిగించి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఇందుకు గల కారణం తెలియరాలేదు. ప్రస్తుతం నెటిజన్లు దీని గురించే తెగ మాట్లాడుకుంటున్నారు.

సమంత ఇన్​స్టా

2017లో హీరో నాగచైతన్యను పెళ్లి చేసుకున్న సమంత.. అనంతరం తన సోషల్​మీడియా అకౌంట్లలో సమంత పక్కన 'అక్కినేని' పదాన్ని జోడించింది. దీనిపై ఆమెను చాలా మంది ప్రశంసించారు. కానీ ఇప్పుడు అకస్మాతుగా ట్విట్టర్​, ఇన్​స్టా నుంచి అక్కినేని పదాన్ని తొలిగించి ఎస్​ అక్షరం పెట్టుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. 'సామ్​ ఎందుకిలా చేసింది?' అంటూ మాట్లాడుకుంటున్నారు.

సమంత ట్విట్టర్​

ఇటీవల 'ది ఫ్యామిలీ మ్యాన్​ 2' వెబ్​సిరీస్​తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది సామ్​. ఈ సిరీస్​లో రాజీ పాత్ర పోషించి.. తనదైన శైలి నటనతో ప్రేక్షకుల ప్రశంసలను అందుకుంది. ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో పాన్​ ఇండియా సినిమా 'శాకుంతలం'లో నటిస్తోంది.

ఇదీ చూడండి: The Family Man 2: సమంత క్షమాపణలు చెప్పాలి

ABOUT THE AUTHOR

...view details