తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అభిమానుల ఆవేదన- సామ్ అంత పనిచేసిందా? - samantha naga chaitanya marriage photos

ఇప్పటికే నాగచైతన్యతో సమంత(chaysam divorce) విడిపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్న అక్కినేని అభిమానులకు.. మరోసారి షాక్​ ఇచ్చింది సామ్​. దీంతో ఫ్యాన్స్​ చాలా బాధపడుతున్నారట! ఇంతకీ ఆమె​ ఏం చేసిందంటే?

sam
సమంత

By

Published : Oct 28, 2021, 3:29 PM IST

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత (chaySam divorce) నెటిజన్లను ఒక్కసారిగా షాక్‌కు గురిచేశారు. గతంలో ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేసిన తన పెళ్లినాటి ఫొటోలను తాజాగా సామ్‌ తొలగించారు. దశాబ్దకాలంగా ప్రేమ, నాలుగేళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు అక్టోబర్‌ 2న సామ్‌, నాగచైతన్య (samantha naga chaitanya marriage photos) ప్రకటించారు. ఆనాటి నుంచి వీరిద్దరూ ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారారు. ఈ నేపథ్యంలోనే తాజాగా సమంత.. తన ఇన్‌స్టా ఖాతా నుంచి చైతన్యతో కలిసి దిగిన ఫొటోలు తొలగించారు(samantha tweet latest).

రానా ఎంగేజ్‌మెంట్‌, పెళ్లి వేడుకల్లో చైతన్యతో దిగిన ఫొటోలు, న్యూ ఇయర్‌ రోజు గోవాలో దిగిన ఫొటోలతోపాటు నిశ్చితార్థం, పెళ్లి (కేవలం హిందూ సాంప్రదాయంలో జరిగిన పెళ్లివి మాత్రమే) చిత్రాలను సమంత ఇన్‌స్టా వేదికగా డిలీట్‌ చేసేశారు. అక్కినేని, దగ్గుబాటి కుటుంబసభ్యులతో ఉన్న ఫొటోలు మాత్రం అలాగే ఉంచారు. దీంతో అభిమానులు ఆవేదనకు లోనవుతున్నారు.

కాగా, సామ్ ప్రస్తుతం దుబాయ్‌ టూర్‌లో ఉన్నారు. తన స్టైలిష్ట్‌ ప్రీతమ్‌ జుకల్కర్‌, మేకప్‌ ఆర్టిస్ట్ సద్నాసింగ్‌లతో కలిసి ఆమె పర్యటనకు వెళ్లారు.

ఇదీ చూడండి: samantha tweet latest: 'పెళ్లి'పై సామ్​ ఆసక్తికర పోస్ట్‌

ABOUT THE AUTHOR

...view details