అగ్ర కథానాయిక సమంత(samantha movie list) సినిమాలతో సందడి చేయడమే కాదు.. కాస్త సమయం దొరికితే తనకు నచ్చిన పనుల్లో నిమగ్నమైపోతున్నారు. సోమవారం(సెప్టెంబరు 27) ఉదయం హైదరాబాద్ నగరంలో వర్షం పడుతుండగా.. పారా సైక్లిస్ట్స్‌తో కలిసి సైకిల్ రైడ్‌కు వెళ్లారామె. ఈ సందర్భంగా వారితో కలిసి సైకిల్ తొక్కుత్కున్న వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. "ప్రతి రోజూ ఈ పారా సైక్లిస్ట్స్, సైకిలింగ్ నాకు స్ఫూర్తి. వర్షంలో వీరితో కలిసి ఇలా సైకిల్ తొక్కడం.. అదే ఓ చక్కటి తోడు. తొలిరోజే 21కిలోమీటర్లు తొక్కా. త్వరలోనే వంద కిలో మీటర్లను చేరుకునేందుకు సిద్ధంగా ఉన్నా" అని తెలిపారు.
ఇటీవలే షూటింగ్స్ నుంచి బ్రేక్ తీసుకున్న సమంత(samantha and keerthi suresh movie together) తన స్నేహితులు కీర్తి సురేష్, త్రిష, కల్యాణి ప్రియదర్శన్‌తో సరదాగా గడిపారు. తన పెంపుడు కుక్క పిల్లలు హ్యాష్, సాషా విశేషాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తున్నారు. త్వరలోనే సామ్.. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'శాకుంతలం'(samantha shakuntala movie) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.