హీరో నాగార్జున పుట్టిన రోజును జరుపుకునేందుకు స్పెయిన్ వెళ్లిన అక్కినేని కుటుంబం.. ప్రస్తుతం అక్కడ ఆనందంగా గడుపుతోంది. అందులో భాగంగా భర్త నాగచైతన్యతో డ్యాన్స్ చేస్తున్న వీడియోను ఇన్‌స్టాలో పంచుకుంది హీరోయిన్ సమంత . "నాలాగే నువ్వు ఎప్పుడూ ఉత్సాహంగా ఉండాలనుకుంటావు.. ఐ లవ్యూ.." అనే వ్యాఖ్యను జోడించింది. 'వీ విల్ రాక్ యూ' అంటూ సాగే ఈ పాటకు వీరిద్దరూ రొమాంటిక్ స్టెప్పులేశారు. కేవలం 16 గంటల్లోనే 18 లక్షలమంది ఈ వీడియోను వీక్షించడం విశేషం.
రొమాంటిక్ స్టెప్పులతో అదరగొట్టిన చై-సామ్ - అక్కినేని నాగచైతన్య
సినీ జోడి అక్కినేని నాగచైతన్య, సమంత ఓ పార్టీలో డ్యాన్స్ చేసి అలరించారు. ఇన్‌స్టాలో సమంత పోస్ట్ చేసిన ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
నాగచైతన్య, సమంత
విక్టరీ వెంకటేశ్‌తో కలిసి 'వెంకీమామ' చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నాడు నాగచైతన్య. '96' రీమేక్‌లో శర్వానంద్ సరసన నటిస్తోంది సమంత.
ఇదీ చూడండి: వినాయక చవితికి 'గ్యాంగ్ లీడర్' కానుక
Last Updated : Sep 29, 2019, 1:56 AM IST