యంగ్‌టైగర్ ఎన్టీఆర్(meelo evaru koteeswarudu ntr episode) వ్యాఖ్యాతగా బుల్లితెరపై ప్రసారమవుతున్న 'ఎవరు మీలో కోటీశ్వరులు'(Evaru Meelo Koteeswarulu) కార్యక్రమానికి కథానాయిక సమంత వచ్చి సందడి చేశారు(meelo evaru koteeswarudu samantha). దసరా నవరాత్రి వేడుకలను పురస్కరించుకుని ఈ స్పెషల్ ఎపిసోడ్‌ను ప్రసారం చేయనున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్-సమంతల(ntr samantha movies) మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఇందుకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు.
'కూర్చుంటే భయంగా ఉంది' అని సమంత అనగా, 'ఉంటుంది. ఇది హోస్ట్ సీట్.. అది హాట్ సీట్' అంటూ ఎన్టీఆర్ సమాధానమిచ్చారు. 'సాధారణంగా ఎవరైనా వెయ్యి నుంచి కోటికి వెళ్తారు.. నువ్వు కోటి నుంచి వెయ్యికి వస్తే ఆట బాగుంటుంది కదా' అని ఎన్టీఆర్ అనడం వల్ల సమంత నవ్వేసింది. ఆ తర్వాత 'వదిలేయనా డబ్బు' అని సమంత అనగా, 'అయితే, క్విట్ అయిపోతావా' అని ఎన్టీఆర్ అడిగారు. 'మీరు ఇప్పుడు చెబుతున్నారు. ముందే చెప్పాలి కదా' అని సమంత కాస్త అసహనం వ్యక్తం చేయడం ఆసక్తిగా అనిపించింది.