రామ్ చరణ్‌పై సమంత ప్రశంసలు కురిపించింది. ఈ మధ్య చెర్రీ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్‌గా మారాడు. వన్యప్రాణి సంరక్షణకు ప్రపంచస్థాయి నిధుల సమీకరణలో చరణ్ భాగమయ్యాడు. ఈ నేపథ్యంలోనే వైల్డెస్ట్ డ్రీమ్స్ పేరుతో ఓ ప్రత్యేక ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశాడు. ఈ ఎగ్జిబిషన్ చూసేందుకు పలువురు సెలబ్రిటీలు వచ్చారు. ఎగ్జిబిషన్‌కు వచ్చిన సమంత రామ్‌చరణ్ తీసిన పలు వైల్డ్ లైఫ్ ఫొటోలు బాగున్నాయని ఇన్‌స్టా వేదికగా మెచ్చుకుంది.
"వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీతో అద్భుతమైన సాయంత్రాన్ని మాకందించిన రామ్‌చరణ్, ఉపాసనకు ధన్యవాదాలు. చరణ్ .. వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ చాలా అద్భుతంగా ఉంది."