విదేశాల్లో చదువుకోవాలనేది తన చిరకాల కోరికని చెప్పింది 'ఓ బేబి' నటి సమంత. హైదరాబాద్లో ఓ కార్యక్రమానికి హాజరైన ఈ భామ తన మనసులో మాటను అభిమానులతో పంచుకుంది.
"ప్రతి ఒక్కరు కలలు కన్నట్లే నేనూ విదేశాల్లో చదువుకోవాలని అనుకున్నా. ఆస్ట్రేలియా సిడ్నీ విశ్వవిద్యాలయంలో చదవాలనేది నా కల. అప్పట్లో కొన్ని కారణాల వల్ల వెళ్లలేకపోయా. తర్వాత సినిమాల్లో బిజీ అయిపోయి ఆ కోరికను తీర్చుకోలేకపోయా." -సమంత, కథానాయిక