'జెస్సీ'గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సమంత.. తక్కువ సమయంలోనే టాలీవుడ్ అగ్రహీరోల సరసన నటించే అవకాశాలు దక్కించుకుంది. ఎన్నో అద్భుతమైన పాత్రలకు ప్రాణం పోసి స్టార్ హీరోయిన్గా ఎదిగింది. 2017లో హీరో నాగచైతన్యను వివాహం చేసుకొని, అక్కినేని ఇంట్లో కోడలిగా అడుగుపెట్టింది. అప్పటి నుంచి సమంత అక్కినేనిగా మారింది. అయితే ఈమె అసలు పేరు సమంత కాదు. సామ్‌కు యశోద అనే పేరు కూడా ఉంది.
అయితే ఈ పేరుతో సమంతను.. ఆమె పాఠశాల, కాలేజి స్నేహితులు, పుట్టింట్లో మాత్రమే పిలిచేవారు. దీని గురించి బయట ఎక్కడా తెలియకపోవడం వల్ల ఆమె పేరు సమంత అనే అందరూ భావిస్తున్నారు.