ఈ ఏడాది.. తన జీవితంలో ఎంతో కష్టంగా సాగిందని అగ్ర కథానాయిక సమంత (samantha) అన్నారు. బాలీవుడ్, దక్షిణాదికి చెందిన పలువురు తారలతో ఇటీవల ఓ ఛానల్ స్పెషల్ ఇంటర్వ్యూ నిర్వహించింది. తాప్సీ, విక్కీ కౌశల్, సిద్దార్థ్ మల్హోత్రతో పాటు నటి సమంత ఈ సరదా చిట్‌చాట్‌లో పాల్గొన్నారు. డిసెంబర్ 6న ఈ ఇంటర్వ్యూ ఫుల్ వీడియో ప్రేక్షకుల ముందుకు రానున్న తరుణంలో ఓ స్పెషల్ ప్రోమో తాజాగా బయటకు వచ్చింది.
ఇందులో 2021 ఎలా గడిచిందో ఒక్కమాటలో చెప్పాలని తారల్ని కోరగా.. అందరూ భిన్నమైన అభిప్రాయాలు పంచుకున్నారు. సమంత (Samantha Latest News) మాట్లాడుతూ.. "నా జీవితంలో 2021 ఓ క్లిష్టమైన ఏడాది," అని తెలిపారు. ఈ వీడియో చూసిన సామ్ అభిమానులు.. "బీ స్ట్రాంగ్" అని కామెంట్లు చేస్తున్నారు.
వ్యక్తిగత జీవితంలో ఈ ఏడాది సమంత ఇదివరకే ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. నాగచైతన్యతో వైవాహిక బంధానికి (Chaysam Divorce) ఆమె ఫుల్‌స్టాప్ పెట్టారు. పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నట్లు ఈ జంట (Naga Chaitanya Latest News) అక్టోబర్ 2న ప్రకటించింది.
దీంతో మానసికంగా కుంగుబాటుకు లోనైన సామ్.. ఆ బాధ నుంచి బయటకువచ్చేందుకు కెరీర్‌పై దృష్టి సారించారు. వరుస సినిమాలకు పచ్చజెండా ఊపుతున్నారు. ఇందులో భాగంగా ఇటీవలే ఆమె తెలుగులో రెండు ప్రాజెక్ట్‌లు ఓకే చేశారు. 'అరెంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్'లోనూ సామ్ కీ రోల్ పోషిస్తున్నారు. ఇవి మాత్రమే కాకుండా ఆమె ప్రధాన పాత్రలో నటించిన 'శాకుంతలం', 'కాతువక్కుల రెందు కాదల్' చిత్రాలు ప్రస్తుతం నిర్మాణ, నిర్మాణాంతర పనులు జరుపుకొంటున్నాయి. 'ఫ్యామిలీ మ్యాన్-2'తో ఈ ఏడాది ఆరంభంలోనే ఆమె నటిగా మంచి సక్సెస్ అందుకున్నారు.