బాలీవుడ్‌లో ఇప్పుడు దక్షిణాది కథానాయికల హవా కనిపిస్తోంది. ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్, రష్మిక, పూజా హెగ్డే.. లాంటి భామలంతా హిందీలో వరుస ఆఫర్లతో జోరు చూపిస్తున్నారు. 'ది ఫ్యామిలీమెన్ 2' వెబ్‌సిరీస్‌తో సమంత కూడా ఓటీటీ వేదికగా ఉత్తరాది ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. రాజీ అనే ప్రతినాయిక ఛాయలున్న పాత్రను సామ్ పోషించింది. ఇది జూన్ 4న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది.
ఈ నేపథ్యంలోనే ఫ్యామిలీమెన్ బృందంతో కలిసి ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటోంది సమంత. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో సామ్ పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. "బాలీవుడ్‌లో ఏ హీరోతో తెర పంచుకోవాలనుకుంటున్నారు" అని ప్రశ్నించగా.. 'రణబీర్ కపూర్‌తో కలిసి నటించాలనుంద'ని బదులిచ్చింది.