'ఆస్క్ మీ ఎవ్రీథింగ్' అంటూ హీరోయిన్ సమంత, ఇన్స్టా ఫాలోవర్లతో ముచ్చటించింది. ఇందులో భాగంగా తాను, 2017 నుంచి ప్రెగ్నెంట్ అని చెప్పి షాక్కు గురిచేసింది. కానీ తన కడుపు నుంచి బయటకొచ్చేందుకు ఆ చిన్నారి భయపడుతున్నాడని తెలిపింది. దీనితో పాటు మరిన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది.
మీరు వేసుకున్న టాటూకు అర్థం?
సమంత: 'మీ రియాలిటీని మీరే సృష్టించుకోండి' అనేది దాని అర్థం. మా ఇద్దరి చేతులపైనా(నాగచైతన్యకు కూడా) ఉంటుంది. ఇదంటే మాకెంతో ప్రత్యేకం.
వంట లేదంటే మొక్కల పెంపకం?
సమంత: లాక్డౌన్లో ఓ విషయమై పనిచేశాను. దానిని మీతో పంచుకోవాలని చాలా ఉత్సాహంగా ఉన్నాను.