హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటిస్తోన్న ప్రయోగాత్మక చిత్రం ‘ఓ బేబీ’. చిత్రబృందం విడుదల చేసిన టీజర్ ఆకట్టుకునేలా ఉంది. కొరియన్ సినిమా 'మిస్ గ్రానీ'కు రీమేక్‌గా తెరకెక్కింది ఈ చిత్రం. నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. 70 ఏళ్ల వృద్ధురాలి ఆత్మ, 20 ఏళ్ల యువతి శరీరంలోకి ప్రవేశించాక ఏమైందనే వినూత్న కథాంశంతో ఈ సినిమా తీసినట్లు తెలుస్తుంది. వృద్ధురాలిగా సీనియర్ నటి లక్ష్మి, యువతిగా సమంత నటిస్తున్నారు.
అభినయంతో ఆకట్టుకున్న 'ఓ బేబీ' - నందిని రెడ్డి
70 ఏళ్ల వృద్ధురాలి ఆత్మ.. 20 ఏళ్ల యువతి శరీరంలోకి ప్రవేశించాక ఏం జరిగిందనే వినూత్న కథాంశంతో వస్తోన్న సినిమా 'ఓ బేబీ'. సమంత ప్రధాన పాత్ర పోషిస్తోంది. తాజాగా చిత్రబృందం విడుదల చేసిన టీజర్ ఆకట్టుకుంటోంది.
ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని జూలైలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందించాడు. నాగశౌర్య, రావు రమేశ్, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రల్లో నటించారు. సురేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై సురేశ్‌బాబు నిర్మిస్తున్నారు.
‘మాంచి వయసులో ఉన్నప్పుడే మా ఆయన పోయాడు. నాని గాడిని పెంచి పెద్ద చేయడమే సరిపోయిందంటూ..’ నాగశౌర్యతో సమంత చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. ‘నాతో ఎంజాయ్‌మెంట్ మామూలుగా ఉండదు ఒక్కొక్కడికి.. చూస్తారుగా’ అంటూ సమంత ఇచ్చిన ఫైనల్ టచ్ అదిరింది.