తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఇన్​స్టాగ్రామ్​లో సమంత సరికొత్త రికార్డు - ఫ్యామిలీ మ్యాన్​ 2

టాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​ సమంత ఇన్​స్టాగ్రామ్​లో సరికొత్త రికార్డును సృష్టించారు. 15 మిలియన్ల ఫాలోవర్స్​ను దక్కించుకున్న తొలి తెలుగు నటిగా ఆమె ఘనత సాధించారు.

Samantha Akkineni celebrates 15 million followers on Instagram
ఇన్​స్టాగ్రామ్​లో సమంత సరికొత్త ఘనత

By

Published : Feb 7, 2021, 8:02 AM IST

ఇన్​స్టాగ్రామ్​లో సరికొత్త రికార్డును సృష్టించారు స్టార్​ హీరోయిన్​ సమంత. ఈ సోషల్​మీడియా వేదికగా 15 మిలియన్ల మంది ఫాలోవర్స్​ మార్క్​ను దక్కించుకున్న తొలి టాలీవుడ్​ నటి​గా ఆమె ఘనత సాధించారు. ఈ సందర్భంగా అభిమానులు కృతజ్ఞతలు తెలుపుతూ సామ్​ ఓ వీడియో పోస్టు చేశారు.

"నేను ఇప్పుడే షూటింగ్​ పూర్తి చేసుకుని వచ్చాను. అంతలోనే నాకు సర్​ప్రైజ్​ వచ్చింది. ఇన్​స్టాగ్రామ్​లో 15 మిలియన్ల మంది ఫాలోవర్స్​ మార్క్​ను చేరుకున్నట్లు తెలుసింది. ఈ సందర్భంగా నన్ను అనుసరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు".

- సమంత అక్కినేని, కథానాయిక

సమంత నటించిన తొలివెబ్​సిరీస్​ 'ది ఫ్యామిలీ మ్యాన్​ 2' ఫిబ్రవరి 12న విడుదల కావాల్సిఉన్నా.. అనుకోని కారణాల వల్ల రిలీజ్​ వాయిదా పడింది. వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం గుణశేఖర్​ దర్శకత్వంలో 'శాకుంతలం' అనే పాన్​ఇండియా మూవీ షూటింగ్​లో సామ్​ బిజీగా ఉన్నారు.

ఇదీ చూడండి:'ఇన్నాళ్లు ఏం కోల్పోయానో తెలుసుకున్నా!'

ABOUT THE AUTHOR

...view details