తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నా 'సూపర్​హీరో' సినిమా కోసం ఎదురుచూస్తున్నా: సమంత - రానా దగ్గుబాటి న్యూస్​

తన సూపర్​హీరో​ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నానని ప్రముఖ హీరోయిన్​ సమంత చెప్పింది. అయితే ఆ సూపర్​హీరో ఆమె భర్త నాగచైతన్య కాదు. అతడెవరంటే?

Samantha Akkineni calls THIS actor as her 'Superhero'
నా 'సూపర్​హీరో' సినిమా కోసం ఎదురుచూస్తున్నా: సమంత

By

Published : Feb 11, 2020, 4:15 PM IST

Updated : Mar 1, 2020, 12:09 AM IST

అద్భుతమైన నటనతో, వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ, అభిమానుల్ని అలరిస్తోంది ముద్దుగుమ్మ సమంత. తోటి నటీనటులను ప్రోత్సహించడంలో ముందుండే ఈ భామ.. తాజాగా ఓ హీరోను పొగడ్తలతో ముంచెత్తింది. సూపర్​హీరో అంటూ, అతడు నటిస్తున్న కొత్త సినిమా కోసం ఎదురుచూస్తున్నానని చెప్పింది. ఆ కథనాయకుడే రానా. ఆ చిత్రం పేరు 'అరణ్య'.

'అరణ్య'లో రానా ఫస్ట్​లుక్​ పోస్టర్​ సోమవారం విడుదలైంది. దీనిని తన ఇన్​స్టా స్టోరీలో పంచుకుని ఆనందం వ్యక్తం చేసింది సమంత. సినిమా కోసం ఎదురుచూస్తున్నానని రాసుకొచ్చింది.

అరణ్య చిత్రంలో రానా

తెలుగులో 'అరణ్య', తమిళంలో 'కాదన్​'గా, హిందీలో 'హాతి మేరే సాథి' పేర్లతో తెరకెక్కుతోందీ సినిమా. విష్ణు విశాల్, జోయా హుస్సేన్​, శ్రియ పిలగోన్కర్​ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ప్రభు సాల్మన్ దర్శకుడు. ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదీ చూడండి.. సల్మాన్​ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన 'బుట్టబొమ్మ'

Last Updated : Mar 1, 2020, 12:09 AM IST

ABOUT THE AUTHOR

...view details