ఈరోజుల్లో నటీనటులందరూ ఫిట్‌నెస్‌పై ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. అందులోనూ హీరోయిన్లు అయితే వారి సౌందర్యానికి తగ్గట్టుగా శరీరాకృతుల కోసం, బరువును నియంత్రించుకోవడం కోసం వ్యాయామాలు, యోగాలు చేస్తున్నారు. వారిలో రకుల్‌ప్రీత్ సింగ్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, సమంత అక్కినేని వంటి వారు ముందుంటారు. ఈ నేపథ్యంలో అక్కినేని కోడలు సమంత సరికొత్తగా తలకిందులుగా వేలాడుతూ ఆసనం వేసిన ఓ ఫొటో సోషల్‌మీడియాలో షేర్ చేసింది. అది ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
తలకిందులుగా తపస్సు చేస్తున్న సమంత! - సమంత శాకుంతలం
యోగాసనాలు, జిమ్‌లో వ్యాయామాలు చేయడం అక్కినేని కోడలు సమంతకు పెద్దగా కష్టమైన పనికాదు. కొత్త వర్కౌట్లు, ఆసనాలతో ఫొటోలను సోషల్‌మీడియాలో షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గాల్లో తలకిందులుగా వేలాడుతూ ఓ ఆసనం వేసిన ఫొటోను సమంత షేర్ చేశారు. ఈ ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
తలకిందులుగా తపస్సు చేస్తున్న సమంత!
సమంత ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'శాకుంతలం' చిత్రంలో నటిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న సినిమాలో సామ్‌కు జోడీగా మలయాళ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నారు. దిల్‌రాజు సమర్పణలో నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇదీ చూడండి:మహేశ్‌బాబుతో 'ఫిదా' తెరకెక్కించి ఉంటే?
Last Updated : Apr 15, 2021, 10:38 AM IST