తెలంగాణ

telangana

ETV Bharat / sitara

టైగర్ ష్రాఫ్​ ఛాలెంజ్‌.. అదరగొట్టిన సమంత - టైగర్​ ష్రాఫ్​ సమంత

Tigershroff Samantha Jim challenge video: బాలీవుడ్​ హీరో టైగర్​ష్రాఫ్​ ఛాలెంజ్​ను స్వీకరించిన హీరోయిన్​ సమంత.. నెటిజన్లతో పాటు సినీప్రముఖులనూ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంతకీ ఆ సవాల్​ ఏంటంటే...

tiger shroff
టైగర్​ ష్రాఫ్​

By

Published : Mar 30, 2022, 6:56 PM IST

Tigershroff Samantha Jim challenge video: బాలీవుడ్‌ యంగ్​ హీరో టైగర్​ ష్రాఫ్.. ​ టాలీవుడ్‌ హీరోయిన్​ సమంతకు ఓ సవాల్‌ విసిరాడు. ఆ ఛాలెంజ్‌ను స్వీకరించిన సామ్​.. నెటిజన్లతో పాటు సినీ ప్రముఖులనూ ఆశ్చర్యానికి గురిచేసింది. తన వర్కౌట్స్‌తో వావ్‌ అనిపించింది.

ఇంతకీ ఆ ఛాలెంజ్‌ ఏంటంటే.. 'అటాక్‌ ఛాలెంజ్‌'... జిమ్‌లో చెమటోడ్చి, ఇతరుల్లో స్ఫూర్తినింపేందుకు ఆ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయాలి. మరొక సెలబ్రిటీకి సవాలు విసరాలి. గతంలో 'ఐస్‌ బకెట్‌', 'రైస్‌ బకెట్‌' తదితర ఛాలెంజ్‌ల్లానే ఇప్పుడు సినిమా ప్రచారానికి కొన్ని ఛాలెంజ్‌లు తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలో వచ్చిందే 'అటాక్‌ ఛాలెంజ్‌'.

జాన్‌ అబ్రహం, జాక్వెలిన్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రమిది. లక్ష్యరాజ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్‌ 1న విడుదలకానుంది. ఈ నేపథ్యంలో కథానాయిక రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ఈ ఛాలెంజ్‌ను ప్రారంభించింది. జిమ్‌లో కసరత్తులు చేసిన వీడియోను పోస్ట్‌ చేస్తూ.. టైగర్‌ష్రాఫ్‌, జాక్వెలిన్‌లకు సవాలు విసిరింది. తర్వాత, జాక్వెలిన్‌.. జాన్‌అబ్రహం, లక్ష్యరాజ్‌కు; టైగర్‌ష్రాఫ్‌.. సమంత, జాకీ భగ్నానీకి ఛాలెంజ్‌ విసిరారు. అలా ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత.. శిక్షకుడి సమక్షంలో వెయిట్‌ లిఫ్టింగ్‌ సహా కఠిన వ్యాయామాలు చేసింది. వీడియోను నెట్టింట పోస్ట్‌ చేస్తూ టైగర్‌ ష్రాఫ్‌కు ధన్యవాదాలు తెలిపి, అర్జున్‌ కపూర్‌కు సవాల్‌ విసిరింది. 'నేను నీలా చేయలేను' అని అర్జున్‌ సరదాగా వ్యాఖ్యానించాడు.

ఇదీ చూడండి: వాటిని పట్టించుకోను.. నా దృష్టిలో సినిమా అంటే అదే: తారక్​

ABOUT THE AUTHOR

...view details