తన నటనతో మైమరిపించి.. అందంతో కుర్రాళ్ల మనసు దోచిన హీరోయిన్ సమంత. ఓ వైపు సినీ పరిశ్రమలో రాణిస్తూనే.. తన అభిరుచికి తగిన వ్యాపారాలపై దృష్టి సారిస్తోందీ అమ్మడు. ఇటీవలే తన ఇంటి డాబాపై పెరటి తోట ఏర్పాటు చేసి.. క్యారెట్లను పెంచిన సామ్ ఇందుకు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లోనూ పోస్ట్ చేసింది. జూబ్లీహిల్స్‌లో స్నేహితులతో కలిసి 'ఏక్కం' అనే ప్రీ స్కూల్‌నూ ప్రారంభించింది.
ఇప్పుడు బట్టల వ్యాపారంలోనూ అడుగుపెట్టింది. యువతకు రకరకాల దుస్తులను పరిచయం చేస్తూ.. 'సాకి వరల్డ్' పేరుతో ఈ బిజినెస్ ప్రారంభించింది.