తెలంగాణ

telangana

By

Published : Dec 31, 2019, 11:55 AM IST

ETV Bharat / sitara

ప్రోమో: సాంగ్ ఆఫ్ ద ఇయర్ 'సామజవరగమన'

'అల వైకుంఠపురములో' సినిమాలోని 'సామజవరగమన' పాట ప్రోమోను చిత్రబృందం విడుదల చేసింది. సంక్రాంతి కానుకగా రానుందీ చిత్రం.

ప్రోమో: సాంగ్ ఆఫ్ ద ఇయర్ 'సామజవరగమన'
'సామజవరగమన' పాట ప్రోమో

స్టైలిష్​ స్టార్ అల్లు అర్జున్.. నూతన సంవత్సరం సందర్భంగా అభిమానులకు సర్​ప్రైజ్​ ఇచ్చాడు. 'అల వైకుంఠపురములో' సినిమాలోని 'సామజవరగమన' ప్రోమోను పంచుకున్నాడు. ఇప్పటికే ఈ పాట.. నెటిజన్ల నుంచి విశేష ఆదరణ పొందుతోంది. ఇప్పుడొచ్చిన ప్రోమో ఆ జోష్​ను మరింత పెంచబోతుంది.

ఇటీవలే సినిమా చిత్రీకరణ పూర్తయింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలోకి రానుంది. బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్​లో వస్తున్న మూడో చిత్రం కావడం వల్ల భారీ అంచనాలు నెలకొన్నాయి. పూజా హెగ్డే హీరోయిన్​గా నటిస్తోంది. సుశాంత్, నవదీప్, టబు, నివేదా పేతురాజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతమందించాడు. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్​ సంయుక్తంగా నిర్మించాయి.

ABOUT THE AUTHOR

...view details