'అల వైకుంఠపురములో' సినిమాలో 'సామజవరగమన' పాట ఎంతలా హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఎక్కడ చూసినా అదే వినిపిస్తోంది. అంతలా సంగీత ప్రియుల్ని ఆకట్టుకుంది. పలు రికార్డులు సృష్టించింది. ఇప్పుడు యూట్యూబ్లో 1 మిలియన్ లైక్లతో, ఈ ఘనత సాధించిన తొలి తెలుగు పాటగా నిలిచింది.
'సామజవరగమన'.. యూట్యూబ్లో లైకుల రికార్డు - అల్లు అర్జున్ సామజవరగమన పాట
'అల వైకుంఠపురములో' చిత్రంలోని సామజవరగమన పాట.. యూట్యూబ్లో మిలియన్ లైక్లు సొంతం చేసుకొని ఈ ఘనత సాధించిన తొలి తెలుగు గీతంగా నిలిచింది.
అల్లు అర్జున్ సామజవరగమన పాట
ఈ సినిమాలో అల్లు అర్జున్-పూజా హెగ్డే జంటగా నటిస్తున్నారు. నవదీప్, సుశాంత్, టబు, రాజేంద్రప్రసాద్, జయరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతమందిస్తున్నాడు. త్రివిక్రమ్ దర్శకుడు. చినబాబు నిర్మాత. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
ఇది చదవండి: 'అరవింద సమేత' తర్వాత మళ్లీ బన్నీ సినిమా కోసం!