అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం 'అల.. వైకుంఠపురములో..'. ఈ సినిమాలోని సిద్ శ్రీరామ్ పాడిన 'సామజవరగమన' పాటకు విశేష ఆదరణ లభించింది. తాజాగా ఈ పాట ఫిమేల్ వెర్షన్ వచ్చేసింది. శ్రేయాఘోషల్ పాడిన ఈ పాటకు సంబంధించిన వీడియోను ప్రముఖ నిర్మాణ సంస్థ ట్విట్టర్ వేదికగా ఈరోజు విడుదల చేసింది. తమన్ స్వరాలు సమకూర్చాడు.
శ్రేయా నోట 'సామజవరగమన' పాట... - అల.. వైకుంఠపురములో సామజవరగమన
తెలుగులో ఇటీవల కాలంలో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన పాట 'సామజవరగమన..'. సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం, సిద్ శ్రీరామ్ గాత్రం, తమన్ సంగీతం సాంగ్‌ను అభిమానుల గుండెల్లోకి దూసుకెళ్లేలా చేశాయి. తాజాగా ఈ పాట ఫిమేల్ వర్షన్‌ను శ్రేయా ఘోషల్ చేత పాడించింది చిత్రబృందం.
శ్రేయా నోట 'సామజవరగమన' పాట...
అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందిన మూడో చిత్రమిది. గతంలో జులాయి (2012), సన్నాఫ్ సత్యమూర్తి (2015) చిత్రాలు వచ్చాయి. తాజాగా రానున్న మూడో చిత్రంలో పూజాహెగ్డే కథానాయిక. సుశాంత్, నివేదా, టబు, జయరామ్, మురళీ శర్మ, సముద్రఖని కీలక పాత్రల్లో నటించారు. అల్లు అరవింద్, రాధాకృష్ణ నిర్మాతలు. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకోగా... యూ/ఏ సర్టిఫికెట్ లభించింది. సంక్రాంతి కానుకగా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.