తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అభిమానులతో సమంత ముచ్చట్లు - i love lucy

అందం, అభినయం కలగలిపిన నటి సమంత. వెండితెరపై తనదైన నటనతో ప్రేక్షకులను అలరిస్తోంది.  గతేడాది విడుదలైన ఐదు చిత్రాలూ సమంతకు పేరుతెచ్చాయి. ఈనెలలో రెండు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా సామ్​ నెటిజన్లతో ట్విట్టర్లో చాట్‌ చేసింది.

'ఐ లవ్​ లూసీ' అంటోన్న సమంత

By

Published : Mar 17, 2019, 11:11 AM IST

సమంత భర్త నాగచైతన్యతో కలిసి నటించిన ‘మజిలీ’ ఏప్రిల్‌ 5న విడుదల కానుంది. తమిళంలో నటించిన ‘సూపర్‌ డీలెక్స్‌’ మార్చి 29న విడుదలకు సిద్ధమయింది. ఈ సందర్భంగా సమంత అభిమానులతో ట్విట్టర్​లో కాసేపు ముచ్చటించింది.

కథలు రిపీట్‌ చేయకుండా విభిన్నమైన స్క్రిప్టుల్ని ఎంచుకునేందుకు మీరు ఏం చేస్తారు?

  • సమంత: ‘మజిలీ’ రొమాంటిక్, ఫ్యామిలీ కథ. ‘సూపర్‌ డీలెక్స్‌’ థ్రిల్లర్‌ సినిమా. అలాంటి విభిన్నమైన కథలు రావాలని కోరుకుంటానంతే.
    విడుదలకు సిద్ధమైన సామ్​ చిత్రాలు

మీ బెస్ట్‌ క్రిటిక్‌ ఎవరు?

  • సమంత: నేనే.

మిమ్మల్ని దృఢంగా ఉంచి, ముందుకు నడిపించే విషయం ఏంటి?

  • సమంత: నేర్చుకోవడాన్ని ఆపేస్తానేమో అనే భయం ముందుకు నడిపిస్తుంది.

అందంగా ఉన్నాననే నమ్మకమే ఓ మహిళను మరింత అందంగా చేస్తుందా?

  • సమంత: అది కచ్చితంగా నిజం.

‘ఓ బేబీ’ చిత్రం కొత్తదనంతో ఆసక్తికరంగా ఉంటుందని ఆశించవచ్చా ?

  • సమంత: అలానే ఉంటుంది ప్రామిస్‌ చేస్తున్నా.
    'ఓ బేబీ' చిత్రంలో సమంత

‘మజిలీ’ సినిమా విజయంపై మీ నమ్మకం ఎంత?

  • సమంత: నేను చేసిన ప్రతి సన్నివేశంపై నాకు నమ్మకం ఉంది. ఈ సినిమా మీ హృదయాల్ని తాకుతుంది.

చైతన్యతో కలిసి మీరు చేసిన పాత్రల్లో బాగా ఇష్టమైనది ఏది?

  • సమంత: జెస్సీ (ఏమాయ చేసావె సినిమాలోని పాత్ర).. ఎందుకంటే అదే మమ్మల్ని ఒక్కటి చేసింది.
    జెస్సీ పాత్రలోనే నాగచైతన్యతో తొలిపరిచయం

ఫ్యాషన్‌పరంగా మీకు స్ఫూర్తిదాయకం ఎవరు?

  • సమంత: ఆడ్రీ హెప్‌బర్న్‌ (బ్రిటిష్‌ నటి, మోడల్, డ్యాన్సర్‌).
    ఆడ్రీ హెప్‌బర్న్‌

చిన్నతనంలో మీరు బాగా చూసి, ఇప్పుడు మిస్‌ అవుతున్న షో?

  • సమంత: ఐ లవ్‌ లూసీ.

కుటుంబంతో కలిసి ‘మజిలీ’ సినిమా చూసేందుకు ఓ గట్టి కారణం చెప్పండి?

  • సమంత: ప్రతి సన్నివేశం వాస్తవికంగా ఉంటుంది. కచ్చితంగా ప్రతి ఒక్కరు సినిమాలోని ఏదో ఒక సన్నివేశానికి కనెక్ట్‌ అవుతారని నేను పందెం కట్టగలను.

మీరు చేసిన ఇన్ని సినిమాల్లో సవాలుగా అనిపించిన పాత్ర ఏది?

  • సమంత: ‘ఓ బేబీ’లోని పాత్ర. ఎందుకంటే కామెడీ పండించడం చాలా కష్టం.
    'ఓ బేబీ’లోని ఓ సన్నివేశం

మీకు స్ఫూర్తిగా నిలిచిన హాలీవుడ్‌ నటి ఎవరు?

  • సమంత: ఆడ్రీ హెప్‌బర్న్, జెన్నీఫర్‌ లారెన్స్, ఎమ్మా స్టోన్‌.

మీలాగా మారాలి అనుకునే వారికి ఏం సలహా ఇస్తారు?

  • సమంత: బాగా కష్టపడటానికి సిద్ధం అవ్వండి.

ABOUT THE AUTHOR

...view details